గోల్డెన్ న్యూస్/ వనపర్తి : మండలం పెబ్బేరు రోడ్డులోని తిరుమలయ గుట్ట సమీపంలో రేడియంట్ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న హరీష్ (15) చదువుతున్నాడు. ఉదయం హరీష్ తన ఫ్రెండ్ తో కలిసి పాఠశాల వెనుక భాగంలో ఉన్న కాళీ ప్రదేశంలోకి బహిర్భూమికి వెళ్లారు. అయితే ఆ పక్కనే వేరుశనగ పంటకు యజమాని అడవి పందుల నుంచి రక్షణ కోసం విద్యుత్ తీగలు అమర్చి… వాటికి కరెంటు ప్రసరింప చేస్తున్నారు. ఇది గమనించని హరీశ్ ప్రమాదవశాత్తు వాటిని ముట్టుకున్నాడు. దీంతో తీగలకు ఉన్న విద్యుత్ షాక్ తగిలి క్రింద పడిపోయాడు. సమాచారం అందుకున్న రేడియంట్ స్కూలు సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిశీలించిన వైద్యులు హరీశ్ మృతి చెందినట్లు ధృవీకరించారు..విద్యుత్ షాక్ కు గురైన హరీష్ స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా చిన్నం బావి మండలం పెద్దమరు గ్రామం. తండ్రి భాస్కరావుకు ఇద్దరు సంతానం కాగా ఇద్దరూ రేడియంట్ స్కూల్ లోనే చదువుతున్నారు. చిన్న కుమారుడు, 7వ తరగతి అభ్యసిస్తున్నాడు. సమాచారం తెలియగానే హరీశ్ తల్లిదండ్రులు, బంధువులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు అని బడికి పంపిన తనయుడు.. విగత జీవిగా పడి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇది ఇలా ఉండగా విద్యార్థి మరణవార్త తెలుసుకుని పలు విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపాయి. మృతుని కుటుంబానికి చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు..
