గోల్డెన్ న్యూస్/ ఖమ్మం : మానవత్వం చాటుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్. ఖమ్మం 3వ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమలకు లక్ష రూపాయల రుణం మంజూరు చేశారు.
కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటుంది. గత శుక్రవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నగరంలో పర్యటిస్తున్న సందర్భంగా కమలమ్మ బండి దగ్గర ఆగారు. దివ్యాంగురాలు కమల కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తనకు తల్లి మాత్రమే ఉందని, తమ కుటుంబం దయాని పరిస్థితిలో ఉందని, బతుకుదెరువు కోసం పల్లీలు అమ్ముకుంటున్నట్లు కమల తన దుర్భర జీవితాన్ని కలెక్టర్ కు వివరించింది.
వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చి వెళ్లారు. కమలమ్మకు రుణం అందించే ఏర్పాట్లు చేయాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు సూచించారు. దీంతో మెప్మా డీఎంసీ సుజాత, సీవో రోజా స్థానిక బ్యాంకు ద్వారా రుణం సదుపాయం కల్పించారు. ఐదు రోజుల్లోనే వ్యాపారం కోసం రూ.1 లక్ష చెక్కును అందించారు. త్వరలో కమలతో కూరగాయాల వ్యాపారం ఏర్పాటు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది..
<