భారీగా నల్ల బెల్లం పట్టివేత..

  నల్ల బెల్లం అక్రమ రవాణా – బెల్లం లారీని పట్టుకున్న ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులు – రూ. 3.10 లక్షల విలువ చేసే బెల్లం స్వాధీనం మూడు వేల క్వింటాళ్ల బెల్లం 100 కిలోల ఆలం స్వాధీనం.

గోల్డెన్ న్యూస్/ తిరుమలగిరి: నాటు సారా తయారీ కోసం వినియోగించే నల్ల బెల్లం ఎక్సైజ్ పోలీసులు  పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర నాందేడ్ నుంచి నల్లగొండ సూర్యపేట తొర్రూర్ ప్రాంతాలకు   అక్రమంగా తరలిస్తున్న  నల్ల బెల్లం ఎక్సైజ్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు…

పిట్లం మెదక్ సిద్దిపేట జనగామ తిరుమలగిరి తొర్రూర్ మహబూబ్ ప్రాంతాలకు బెల్లాన్ని వారి ద్వారా తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు  నల్లగొండ జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ మల్లయ్య బృందం లారీని తిరుమలగిరి  వద్ద పట్టుకున్నారు.. లారీలు 3000 కేజీల బెల్లం 100 కేజీల ఆలం 20 లీటర్ల నాటు సారా ఉంది. ఈ బెల్లం విలువ రూ. మూడు లక్షల పదివేలుగా ఉంటుందని అంచనా వేశారు.

నాటు సారా తయారీకి బెల్లం సప్లయర్ గా కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వినీత్ నాందేడ్ నుంచి లారీలో బెల్లాన్ని పంపించిన లారీ యజమాని, బెల్లాన్ని లారీలో తీసుకువచ్చిన లారీ డ్రైవర్ షేక్ ఫరూక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram