తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి తలమానికం : భట్టి విక్రమార్క

గోల్డెన్ న్యూస్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి తలమానికమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంద్ర శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి కాలరీస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  ఉప ముఖ్యమంత్రి, సింగరేణి కార్మికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. బొగ్గు ఉత్పత్తి ద్వారా దేశ, రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడంలో సింగ‌రేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తూ, రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సింగరేణి వెన్నెముకగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనాధారంగా ఉన్న సింగరేణిని కేవ‌లం బొగ్గు ఉత్పత్తికే ప‌రిమితం చేయ‌కుండా ఇతర రంగాలలోకి కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సింగరేణి సంస్థ సుస్థిర భ‌విష్యత్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రమశక్తిని చాటుతూ సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram