కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి .

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని – తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన..

గోల్డెన్ న్యూస్/ పీనపాక:  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం పినపాక మండల పరిధిలోని ఏడూ ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద గిరిజన సంఘం జిల్లా నాయకులు మడివి రమేష్, మండల అధ్యక్షులు దుబ్బా గోవర్ధన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. పార్లమెంట్‌ సాక్షిగా అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌ షాకు ప్రధాని మోడీ మద్దతు ఇవ్వడం దా రుణమన మని పేర్కొన్నారు . కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొడుతూ, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇటీవల కాలంలో దళితులు, మహిళలపై దాడులు జరుగుతుంటే ఖండించకపోవడం బిజెపి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అమిత్‌ షా వ్యాఖ్యలకు బేసరత్తుగా పార్లమెంటులో క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram