ఘనంగా 136వ సింగరేణి దినోత్సవ వేడుకలు

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం 09.00 లకు సింగరేణి జిఎం కార్యాలయ ఆవరణలో  జెండాను ఆవిష్కరించారు, అనంతరం రుద్రంపూర్ మార్కెట్ ఏరియాలోని అమరవీరుల స్థూపం నుండి ప్రగతి వనం వరకు సింగరేణి పరుగు పందెం నిర్వహించి, ప్రగతి వనం నందు సింగరేణి జెండా ఎగరవేసి, ప్రగతి వనం నందు ఏర్పాటు చేయబడిన వివిధ రకములైన 8 స్టాల్ల్స్ ను ప్రారంబించారు.

సాయంత్రం 7.30 గంటలకు రుద్రంపూర్ ప్రగతివనం నందు నిర్వహించిన సింగరేణి దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు హాజరయ్యారు . ఆయనతోపాటు కొత్తగూడెం ఏరియా ఏ‌ఐ‌టి‌యూ‌సి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రెటరీ జె. గట్టయ్య, ఐ‌ఎన్‌టి‌యూ‌సి వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్ గారు అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఎం.వి. నరసింహ రావు హాజరు అయ్యారు. ముందుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు, కొత్తగూడెం సేవ అధ్యక్షురాలు ఇతర అధికారులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి సింగరేణి దినోత్సవ వేడుకలకను ప్రారంబించారు.  జ్యోతి ప్రజ్వలన కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా ఏ‌ఐ‌టి‌యూ‌సి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రెటరీ జె. గట్టయ్య, ఐ‌ఎన్‌టి‌యూ‌సి వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్ , అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఎం.వి. నరసింహ రావు, సేవా అధ్యక్షురాలు శ్రీమతి. జి. మధుర వాణి షాలేం రాజు , ఎస్. ఓ. టు జి. ఎం. జి వి. కోటి రెడ్డి, ఏరియా ఇంజనేర్ కే. సూర్యనారాయణ రాజు, ఎ.జి.ఎం సివిల్ సి. హెచ్. రామకృష్ణ, డి.జి.ఎం పర్సనల్ బి. శివ కేశవ రావు, సేవ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.

విధులలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఉత్తమ అధికారి క్యాటగిరి అలుగొలు ప్రదీప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సి.హెచ్. దుర్గా ప్రసాద రెడ్డి, డి.వై. ఎస్.ఈ. ఎస్.ఎం.ఎం.సి, జె.వి.ఆర్.ఓ.సి.II ఉత్తమ ఎన్.సి.డబల్యు క్యాటగిరిలో ఆశిలేటి చెన్నకేశ్వర రావు, ఫోరే మెన్, జె.వి.ఆర్.ఓ.సి.II, దొడ్డిపల్లి రమేష్ , శాంప్లింగ్ మజ్దూర్, జె.వి.ఆర్. సి.హెచ్.పి లను ఎం. షాలేం రాజు  శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.

సింగరేణి దినోత్సవ వేడుకలలో వివిధ సంస్కృతిక కార్యక్రమాలు అయినటువంటి ఫోక్ డ్యాన్స్, మిమిక్రీ, మ్యాజిక్ షో మరియు డ్యాన్స్ ప్రోగ్రాం, సింగరేణి కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. అనంతరం పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం జరిగింది.

ఈ సందర్బంగా జి‌ఎం ఎం. షాలేం రాజు  మాట్లాడుతూ.. సింగరేణి దినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉన్నదని, సింగరేణి సంస్థ నూతన టెక్నాలజీ తో ముందుకు కొనసాగుతూ, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం జరుగుతుందన్నారు. ఇందుకు సహకరిస్తున్న అధికారులను, కార్మికులను, యూనియన్ నాయకులను, కాంట్రాక్ట్ కార్మికులను వారు అభినందించారు. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఎన్నో మైలురాళ్ళు అధిగమించడం జరిగింది. అదే విధంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రములో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా,  ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు మార్గదర్శకంగా ఉండడం చాలా సంతోషకరం అని అన్నారు. ఈ సంస్థలో పని చేస్తున్న మనమందరము ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. కనుక సింగరేణి ఆవిర్భావ దినోత్సవం ఏంతో వైభవంగా జరుపుకోవడం మన కర్తవ్యం గా గుర్తించాలన్నారు.

రక్షణతో ఈ ఆర్థిక సంవత్సరంనకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన 149.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని ఉద్బోధించినారు. ఈ ఆర్దిక సంవత్సరములో నేటి వరకు 95.40 (98% శాతం) లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించామని తెలియజేసినారు. అలాగే తదుపరి లక్షమైనటువంటి 54.1 లక్షల టన్నుల ఉత్పత్తిని 31.03.2024 నాటికి సాధించే దిశగా అందరూ కృషి చేయాలని తెలియచేసారు.

ఈ కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా జి.ఎం. పాటు కొత్తగూడెం ఏరియా కొత్తగూడెం ఏరియా ఏ‌ఐ‌టి‌యూ‌సి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రెటరీ జె. గట్టయ్య, ఐ‌ఎన్‌టి‌యూ‌సి వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్  అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఎం.వి. నరసింహ రావు, సేవా అధ్యక్షురాలు శ్రీమతి. జి. మధుర వాణి షాలేం రాజు , ఎస్. ఓ. టు జి. ఎం. జి వి. కోటి రెడ్డి, ఏరియా ఇంజనేర్ కే. సూర్యనారాయణ రాజు, ఎ.జి.ఎం (సివిల్) సి. హెచ్. రామకృష్ణ, డి.జి.ఎం (పర్సనల్) బి. శివ కేశవ రావు,జి.కె. ఒ.సి. పి.ఓ. రమేశ్, ఏజెంట్ రవీందర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎం. వేంకటేశ్వర రావు, డి.జి.ఎం. (పర్సనల్) బి. శివ కేశవ రావు, ఎన్. యోహన్, బి.మాధవ్, మదన్మోహన్, తోట సత్యనారాయణ, సీనియర్ పి.ఓ.లు మజ్జి మురళి, జి‌. సంఘమిత్ర, కే దేవదాస్, ఏరియా సెక్యూరిటి ఆఫీసర్ వి. శ్రీనివాస రావు, రుద్రంపూర్ డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. పరశురాములు, సేవ కొ-ఆర్డినేటర్ సి. హెచ్. సాగర్, అన్నీ మైన్స్ & డెపార్ట్మెంట్స్ హెడ్స్, అధికారులు, సుపెర్వైసర్స్, యూనియన్ నాయకులు, పిట్ సెక్రెటరీలు, సేవా సెక్రటరీ అనిత, అధిక సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు మరియు మహిళల పా ల్గొన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram