అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం

 బూర్గంపాడు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో  మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం

గోల్డెన్ న్యూస్/బూర్గంపాడు :కేంద్ర హోంశాఖ మంత్రి అమీత్ షా అంబేద్కర్ పై పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బూర్గంపాడు మండల కేంద్రంలో సోమవారం దిష్టిబొమ్మని దాహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .. అంబేద్కర్ రాజ్యాంగంలో అన్ని జాతులకు సమానత్వం ఉండాలని ప్రతి పౌరులకి హక్కు కల్పిస్తూ రాసిన రాజ్యాంగం అంబేద్కర్ ని అవమానించడం చాలా దారుణమని అన్నారు. ఇవాళ రిజర్వేషన్లు ఉండటంలో కేంద్రంలో ఉన్న బిజెపి మంత్రులు గాని ఎంపీలు గాని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు ద్వారా పార్లమెంట్ సభకు ప్రతి ఒక్కరూ ఎంపిక అయితున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక రిజర్వేషన్ ఉండటం వల్ల అలాంటి రిజర్వేషన్ లేకుండా చేయాలని చూస్తున్నా

బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం అనేక కొట్రలతో రాజ్యాంగాన్ని లేకుండా చేయాలనే మన ధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకురావాలని చూస్తున్నా బిజెపి అనేక కుట్రలు చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ బజరంగ్దళ్ ఇతర బిజెపికి సంబంధించిన సంస్థలు రాజ్యాంగాన్నికి తోట్లు పోడుతున్న పరిస్థితి

ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తీవ్రంగా అమిషా వైఖరిని ఖండించాలని పార్లమెంటు నుండి బర్తరఫ్ చేయాలని అన్నారు

ఈ దేశం కోసం ఈ సమాజం కోసం విద్య, వైద్యం ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ గారు అనేక విషయాలను సంవత్సరాలు కష్టపడి అనేక ఇబ్బందులు పెట్టిన గాని ఈ దేశాన్ని రక్షించే విధంగా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా రిజర్వేషన్ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్

బిజెపి రాజ్యాంగాన్ని లేకుండా చెయ్యాలనే ప్రయత్నం చేస్తుందని బిజెపి ఇలాంటి మత ఘర్షణలు పెట్టే మత పార్టీలని ప్రజల నుంచి దూరంగా ఉంచాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని

సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ కోరింది ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, పాండవుల రామనాథం, ఎస్ కె అబిదా, భయ్యా రాము, మాజీ జడ్పిటిసి భూపాల్ నరసింహారావు, పాపారావు, శ్రీను, వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram