రేపు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  పాయం. వెంకటేశ్వర్లు మంగళవారం కరకగూడెం మండలంలో పర్యటించనున్నట్లు మండల కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది ..

పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రి నందు 102 అంబులెన్స్ ప్రారంభోత్సవం, 10.30 గంటలకు తాటి గూడెం గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం, అనంతరం అధికారులతో  సమీక్ష  కలదు కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే  పర్యటనను విజయవంతం చేయాలని కోరారు..

Facebook
WhatsApp
Twitter
Telegram