సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

గోల్డ్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : కరకగూడెం మండల పరిధిలోని 20 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.6,50,000ల‌ విలువ చేసే చెక్కులను పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి మంగళవారం కరకగూడె మండలంలో పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో  సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగప్రసాద్, ఎంపీ ఓ కుమార్, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఎర్ర సురేష్, పోలబోయిన తిరుపతయ్య. మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి. చందా వెంకటరత్నమ్మ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram