గోల్డెన్ న్యూస్/ కరకగూడెం:రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కృపా సీయోను ప్రార్థనా మందిరం పాస్టర్ ఇర్ఫాపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో కరకగూడెం తహసిల్దార్ నాగ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ ,నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సోదరులకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్ద పండగ అని కొనియాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం క్రీస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులులకు విందు ఆయన శాంతి సమానత్వం ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండాలని లోక రక్షకుని దీవెనలు ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని అన్నారు .ఈ కార్యక్రమంలో పాల్లొనడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం చర్చ్ పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు ఆర్ఐ కృష్ణ ప్రసాద్ సిబ్బంది పాస్టర్లు కరకగూడెం మండల అధ్యక్షులు ఇర్పశంకర్ పాల్ సెక్రెటరీ పోగు కోటయ్య ట్రెజర్ ఈసం ఇస్సాకు తోకల కొర్నేలీ మాలాకి సీమోను యాకొబు సంఘస్తులు విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు
