వినియోగదారుల్లో చైతన్యం అవసరం — న్యాయమూర్తి తనిజా రెడ్డి

గోల్డెన్ న్యూస్ /ఆంధ్ర ప్రదేశ్. విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.. వివరాల్లోకి వెళితే  స్వచ్ఛంద సంస్థ జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వ్యవస్థాపకులు ఎంవీఎల్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా న్యాయమూర్తి తనిజా రెడ్డి, ఆహార భద్రత విభాగం నందజి, లీగల్ మెట్రోలజీ విభాగం రామారావు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ చైర్మన్ బల్ల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈ స్వచ్ఛంద సంస్థ స్థాపించి 11 సంవత్సరాలు 13 రాష్ట్రాలలో వినియోగదారులు హక్కుల్ని సంరక్షిస్తూ వివిధ సేవలు అందిస్తున్నామని ఆయన అన్నారు. న్యాయమూర్తి తనుజా రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల్లో చైతన్యం అవసరమని ఆమె కొనియాడారు. షేవింగ్ క్రీమ్ పది రూపాయలు అయినప్పటికీ ఒక రూపాయి అదనంగా వేసి వినియోగదారునికి వ్యాపారస్తుడు అమ్మకం చేయడం వలన వినియోగదారుడు చైతన్యంతో తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతూ కౌన్సిల్లో ఫిర్యాదు చేశాడని ఆయనకు కౌన్సిల్లో న్యాయం జరిగిందని ఈ ఘటనపై 10.000 రూపాయలు అపరాధ రుసుము అమ్మకదారులపై అపరాధ రుసుము పడిందని ఆమె తెలియజేశారు. వినియోగదారులు కష్టాలే తప్ప అక్కడ జరిగిన క్రయవిక్రయాలతో సంబంధం ఉండదని ఆమె అన్నారు. ఈ అంశంపై యువతలో మరింత చైతన్యం రావాలని ఆమె కోరారు. 70 సంవత్సరాలు వృద్ధులు కూడా కౌన్సిల్లో ఫిర్యాదు చేసి వినియోగదారుల హక్కుల్ని ఉపయోగించుకున్నారని తెలిపారు. ఆహార భద్రత విభాగం వుడ్ కంట్రోలర్ నందజి మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ప్రజలందరూ ఈజీ మూవింగ్ అలవాటు పడిపోయారని ఆర్గానిక్ ఆహార పదార్థాలు సేవించడం మానేసారని కృత్రిమంగా ఇనిస్టెంట్ గా తయారయ్య ఆహారాలు తినడం వలన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుగా మారిపోతున్నారని ఆహార భద్రత నియమాలు ఏ వ్యాపారస్తుడు పాటించకపోవడంతో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ప్రతి వినియోగదారుడు ఆరోగ్యకరమైన ఆహారం సేవించి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా ధోరణి మలుచుకోవాలని ఆయన కొనియాడారు. హోటల్లో నిబంధనలు పాటించేవారు ఎవరైనా ఎలాంటి సంస్థ పైన అయినా అధికారిక వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ఫుడ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో డైరెక్ట్ గా మీ ఫిర్యాదు చేరుతుందని తదునుగుణంగాచర్యలు చేపడతామని ఆయన కొనియాడారు. వ్యాపారస్తులు ఫుడ్ కోర్టులు ద్వారా ఆహారాల్లో ఎక్కువగా టెస్టింగ్ సాట్లు ఆర్టిఫిషియల్ కలర్లు వాడుతున్నారని అవి తినడం వల్ల వివిధ జబ్బులకు గురవుతున్నారని ఆయన అన్నారు. లీగల్ మెట్రోలజీ రామారావు మాట్లాడుతూ తూనికలు యంత్రాలు పరిశీలనలో బాధ్యత నెరవేరుస్తున్నామని ఎవరికైనా ఆ విషయంలో ఫిర్యాదు చేయాలంటే ఈ 0891-2799551. టోల్ ఫ్రీ నెంబర్ 1967 నెంబర్ కి సంప్రదించాలని ఆయన అన్నారు. వినియోగదారున్ని వ్యాపారస్తులు పలు విధాలుగా మోసానికి గురి చేస్తారని అప్రమత్తగా ఉండాలని ఆయన అన్నారు. వినియోగదారుడుగా మీరు కౌన్సిల్లో ప్రశ్నించాలంటే క్రయవిక్రయాలకు సంబంధించిన బిల్లు తప్పనిసరి అని ఆయన అన్నారు. ప్రత్యేక కౌంటర్ ద్వారా సీజైనా పదార్థాలను చూపిస్తూ వినియోగదారుడు ఏ కోణంలో మోసపోతున్నాడో తెలియపరుస్తూ చైతన్యం కలిగించామని ఆయన అన్నారు. ఐరన్ దుకాణాలలోనూ, పండ్లు దుకాణాలలోనూ వినియోగదారులని ఎక్కువగా మోసాలకు గురి చేస్తున్నారని ఈ తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయని తస్మాత్ జాగ్రత్త వహించాలని ఆయన అన్నారు. వ్యవస్థాపకులు ఎం వి ఎల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ వినియోగదారులు హక్కుల్ని సంరక్షించేందుకు ఈ సంస్థను స్థాపించామని వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని ఆయన అన్నారు. వినియోగదారుడు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఎదుర్కునేంతవరకు వాళ్ళ హక్కులను సంరక్షించే కార్యక్రమంలో తమ వంతు పాత్ర వహిస్తామని ఆయన అన్నారు.కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు, ఏపీ స్టేట్ చైర్మన్ బల్లా శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ అబ్జర్వర్ విభాగం అవినాష్, ఆహార భద్రత అబ్జర్వర్ వాసు ,మీడియా విభాగం చైర్మన్ కమల్, పృద్వి , జిల్లా సెక్రెటరీ అప్పలరాజు (నాయుడు), మీడియా విభాగం సెక్రటరీ 9టీవీ మధు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మీడియా విభాగం నాగాల రాజేష్ ,మీడియా విభాగం కోఆర్డినేటర్ బలివాడ కన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram