హిజ్రాతో సన్నిహితంగా ఉంటున్న యువకుడు – కుమారుడిని మందలినప్పటికీ వినకపోవడంతో మనస్థాపంతో తల్లిదండ్రుల ఆత్మహత్య..
గోల్డెన్ న్యూస్/ నంద్యాల – ఆ కుటుంబానికి ఒక్కడే కుమారుడు పెంచి పెద్ద చేసిన కుమారుడు హిజ్రాతో సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసి ఆ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఉన్నప్పటికీ పోస్టుమార్టం గదిలో అనాథ శవాల మాదిరిగా వారిని ఉన్న వారిని చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెళ్లడించారు.
ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఏ కష్టమూ తెలియకుండా పెంచారు. ఆస్తులు లేకున్నప్పటికీ పూలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుమారుడిని ఇంజినీరింగ్(బీటెక్) దాకా చదివించారు. అతడికి చదువు అబ్బకపోవడంతో అతడి కోరిక మేరకు ఓ ఆటో కొనిచ్చారు. రోజూ ఆటో నడుపుతున్నటువంటి అతడి ఆలోచనలు, అభిరుచులను మాత్రం ఆ తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. ఆటో నడుపుతున్న క్రమంలోనే యువకుడికి హిజ్రాలతో ఏర్పడిన పరిచయం చెడు స్నేహానికి దారి తీసింది. ఈ విషయంపై తల్లిదండ్రులు మందలించారు.అయితే హిజ్రా గ్యాంగ్ వారి షాపుకు వచ్చి బూతులు తిడుతూ హంగామా చేశారు.. దీంతో అవమానం తట్టుకోలేక సుబ్బ నాయుడు, సరస్వతీ దంపతులు పువ్వుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు.హిజ్రాతో సన్నిహితంగా ఉంటున్న యువకుడు – కుమారుడిని మందలినప్పటికీ వినకపోవడంతో తల్లిదండ్రుల ఆత్మహత్య..