తమ డిమాండ్స్ ను నెరవేర్చాలని సమ్మెబాట పట్టిన కరకగూడెం గ్రామపంచాయతీ కార్మికులు..
గోల్డెన్ న్యూస్/కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో శుక్రవారం గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గుమ్మడివల్లి కృష్ణ మాట్లాడుతూ.. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు, గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలు పెంచాలని కోరారు. గతంలో లాగానే కారోబార్ బిల్ కలెక్టర్కు సహాయ కార్యదర్శి హోదా కల్పించి ఉద్యోగ భద్రత ఇవ్వాలని, జీవిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
Post Views: 98