మల్టి పర్పస్ విధానం రద్ధచేయాలి..

మల్టి పర్పస్ విధానం రద్ధచేయాలి  –  పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి –  సిఐటియు నాయకులు కొమరం కాంతారావు

గోల్డ్ న్యూస్/కరకగూడెం : గ్రామపంచాయితీ కార్మికులకు ఎన్నికలముందు ఇచ్చిన హామీ మేారకు మల్టిపర్పస్ విధానం రధ్ధుచేసీ.కనీసవేతనం 26వేలు అమలు చేయాలని వీటిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు డిమాండ్ చేశారు. ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా కార్మికులు చేస్తున్న ఆందోళన పోరాటాలకు పోలీసులు ప్రయోగించి అనిచివేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తుందని విమర్శించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని నిరసిస్తూ 27 28 తేదీల్లో రెండు రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలని రాష్ట్ర జేఏసీ నిర్ణయించిందని మల్టీపర్పస్ ద్వారా పనులు చేయడంతో అనేక రకాల ప్రమాదాలు జరిగి పంచాయతీ కార్మికులు చనిపోతున్నారని ఫలితంగా వారి కుటుంబాలు అనాధలుగా మారుతున్నాయని తెలిపారు పంచాయతీ కార్మికులందరికీ 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని ప్రమాదాలు జరిగి మరణించిన కార్మికుల కుటుంబానికి ఇన్సూరెన్స్ తో పాటు మరొక పది లక్షల ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్మికులు చేస్తున్న పోరాటాన్ని ప్రజలు బలపరచాలని విజ్ఞప్తి చేశారు పెండింగ్ లో వున్న వేతనాలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామపంచాయితీఎంప్లాయిస్ &వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు ఉప్పలి సాంబశివరావు, గుమ్మడివెల్లీ కృష్ణ, ధనుంజయ్, శంకర్, చర్ప సాంబశివరావు, ప్రశాంత్, పాపారావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram