కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత..

ప్రభుత్వం మెనూ మార్చిన –  కేజీబీవీలో మారని పనితీరు. – ఉడకని అన్నం పెట్టడంతో 10 మంది విద్యార్థినులకు వాంతులు, కడుపునొప్పి ఆస్పత్రికి తరలింపు..

గోల్డెన్ న్యూస్/ నిర్మల్  :   అనంతపేట్ కేజీబీవీలోని పది మంది విద్యార్థినులు ఉడికీ ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అస్వస్థతకు గురయ్యారు

మధ్యాహ్నం వండిన భోజనం సరిగా ఉడకక పోవడంతో పాఠశాలలో దాదాపు పది మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు

వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు

అందులో ఐదుగురి పరిస్థితి మెరుగుపడడంతో పాఠశాలకు పంపించారు. మరో ఐదుగురిని డాక్టర్ల పర్యవేక్షణలోఉంచారు

ఎంఈవోఓను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధుల్లో చేరినట్లు, అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని, దానిని తిన్న విద్యా ర్థులు వాంతులు చేసుకున్నట్టు పేర్కొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram