పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పంచాయతీ కార్మికులు సమస్య లను గుర్తించని కాంగ్రెస్ ప్రభుత్వం.-.పారిశుద్ధ కార్మికుల యొక్క సమస్యలను తీర్చాలని సంఘీభావం తెలిపిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య..

గోల్డెన్ న్యూస్/కరకగూడెం : మండల వ్యాప్తంగా 16 పంచాయతీ లలో మల్టి పర్పస్ కారోబార్ లు అందరూ కలిసి మండలంలో సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులకు సంగిభావం తెలియజేస్తూ..ఈ సందర్బంగా రావుల సోమయ్య గారు మాట్లాడుతూ …పంచాయతీ కార్మికులకు కనీస జీతాలు అలావెన్సులు ఇవ్వకుండా పంచాయతీ కార్మికుల యొక్క శ్రమను దొసుకోవడమే కాకుండా వారికీ కనీసం నెలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు…

కార్మికులకు మల్టి పర్పస్ విధానాన్ని రద్దు చెయ్యాలికనీస వేతనం 26000/ ఇవ్వాలని 

కరో బార్ బిల్ కలెక్టర్కు సహాయ కార్యదర్శి హోదా ఇవ్వాలని ఉద్యోగ భద్రత జీవిత భీమా ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చెయ్యడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంచాయతీ లో ఒకరు ఇద్దరు ఉన్నటు వంటి సిబ్బంది నెలకు జీతం 1000 కి 1500 చేస్తున్న వారిని కెసిఆర్ గారు గుర్తించి వారికీ ప్రతి నెలకు 8500/రూపాయలు వచ్చేలా రూపాకల్పనా చేసారు అని అన్నారు అలాగే పంచాయతీ కి ఒక భవనం తో పాటు ఒక ట్రాక్టర్ ఇచ్చి పారిశుధ్యన్ని క్లిన్ & గ్రీన్ గా పంచాయతీ లను తీర్చి దిద్దిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్య మంత్రి శ్రీ *కెసిఆర్ దే* అని అన్నారు..గత ఎన్నికల లో ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలని చెయ్యలేని యడల ఉద్యమన్ని ఉదృతం చేస్తా మని వారు తెలియ జేశారు.ఈకార్యక్రమంలో పోగు వెంకటేశ్వర్లు కొమరంరాంబాబు మాజీ సర్పంచులు ఊకె రామనాధం పాయం నరసింహారావు,గోగ్గాలి నరసయ్య ఎలాగొండ శ్రీనివాస్ యాగ్గడి శ్రీను గాందేర్ల సతీష్ సాధనపల్లి లక్ష్మి నారాయణ పంచాయతీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram