పేలిపోయిన విమానం, 70 మంది మృతి.  

మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం సౌత్ కొరియాలో షాక్కు గురిచేస్తున్న విమాన ప్రమాద లైవ్ దృశ్యాలు విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా రన్ వేను రాసుకుంటూ వెళ్లి గోడను ఢీకొట్టిన్న ఫ్లైట్….

ఒక్కసారిగా ఫ్లైట్ పేలిపోయి భారీగా చెలరేగిన మంటలు….ఆ సమయంలో విమానంలో ఉన్న 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది  కొరియా విమాన ప్రమాదానికి పక్షే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఓ పక్షి విమానం ల్యాండింగ్ గేర్ను ఢీకొట్టడంతో అది డ్యామేజ్ అయిందని తెలిపారు. ల్యాండింగ్ గేర్ లేకుండానే ఎమర్జెన్సీగా బెల్లీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా రన్ వేపై అదుపుతప్పిందన్నారు. ఆ వెంటనే గోడను ఢీకొట్టి ఫ్లెట్ పేలిపోయింది. పక్షి విమానాన్ని ఢీకొట్టిన వీడియో వైరల్ అవుతోంది. 70 మంది మరణించగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

Facebook
WhatsApp
Twitter
Telegram