గోల్డ్ న్యూస్/ హైదరాబాద్ : రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఆ దిశగా వేగంగా పెంచింది దానిలో భాగంగానే.. రైతు భరోసాపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమైంది.,మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్‌కమిటీ చర్చించింది. సంక్రాంతికే రైతు భరోసా ఇవ్వాలని మంత్రి వర్గం సబ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసింది. అయితే.. రైతు భరోసా విధివిధానాలపై మరోసారి భేటీ కావాలని సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Post Views: 22