– డిజిటల్ మీడియా సామాన్యుల స్వరం ..
– డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి ..
— మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి..
డిజిటల్ మీడియా జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడుగా మల్లెబోయిన లింగయ్య.
గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కొత్తగూడెం యూటీఎఫ్ కార్యాలయంలో మల్లెబోయిన లింగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంపెల్లి ముతేష్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ మీడియా జర్నలిస్టు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు.డిజిటల్ మీడియా సామాన్యుల గొంతుకగా పనిచేస్తుందని, ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి అత్యంత వేగంగా తీసుకువెళ్లడంలో డిజిటల్ మీడియా ముందుంటుందని పేర్కొన్నారు. గతంలో ప్రధాన మీడియా, పత్రికల్లో పనిచేసిన వారు ప్రస్తుతం డిజిటల్ మీడియాలోకి వచ్చి స్వతంత్ర జర్నలిస్టులు గా కొనసాగుతూ సమాజ అభివృద్ధికి తమవంతు తోడ్పాటును అందిస్తూ పాఠకుల మన్ననలు పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు వారిపై చిన్నచూపు తగదని పేర్కొన్నారు. డిజిటల్ మీడియా జర్నలిస్టులకు చట్టబద్ధ త కల్పిస్తూ వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, వేడుకున్నారు.. అంతేకాకుండా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ గౌరవ అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి చందా శ్రీనివాస్,రాష్ట్ర అధ్యక్షుడు కే. రాజేందర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ తదితరులు పాల్గొన్నారు..