బి టి పి ఎస్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె..

బి టి పి ఎస్ లో కాంట్రాక్ట్ కార్మికుల మెరుపు సమ్మె.  ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్లు..

గోల్డెన్ న్యూస్/ మణుగూరు :  భద్రాద్రి పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు  మెరుపు సమ్మెకు దిగారు సోమవారం నుండి తమకు వేతనాలు అందే వరకు నిరసన తెలియజేస్తామన్నారు బిల్లులు రాక కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాంట్రాక్టర్లు అప్పులు చేసి జీతాలు ఇస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదని వాపోతున్నారు బి టి పి ఎస్ లో వేతనాలు లేక రోజు వారి జీవితం గడప లేక తీవ్ర ఆర్థిక ఇబ్బంది గురవుతున్నామని కార్మికులు తెలుపుతున్నారు పెరుగుతున్న ధరలు ఒకవైపు వేతనాలు రాక తీవ్ర అప్పుల్లో కురుకుపోయామని కాంట్రాక్ట్ కార్మికులు వాపోతున్నారు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు నాలుగు నెలల వేతనాలు ఇవ్వలేదన్నారు.  పెండింగ్ ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని జెన్కో అధికారులను కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram