రేపు రాత్రి ఉచిత రవాణా సౌకర్యం, ఎక్కడంటే..!

 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్న తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్.

గోల్డెన్ న్యూస్/తెలంగాణ:  తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేయనట్లు తెలియజేశారు. ఈ ఉచిత రవాణా సౌకర్యం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో  ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు .ఈ సందర్భంగా 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ సభ్యులు వివరించారు.ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా ఉండేందుకు  అసోసియేషన్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇలా చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని ఫోర్‌ వీలర్స్‌ అసోసియేషన్ అవి భయపడింది

Facebook
WhatsApp
Twitter
Telegram