భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది..కుటుంబ సభ్యులు. తెలిపిన వివరాల ప్రకారం జూలూరుపాడు మండల పరిధిలోని మాచినిపేట తండాలో లకావత్ అశోక్ శివాని దంపతుల కుమారుడు మంగళవారం ఉదయం అశోక్ పనికి వెళ్లగా శివాని ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా రెండు సంవత్సరాల బాలుడు అరుబయట ఆడుకుంటూ ఉండగా కోతులు రావడంతో తల్లి శివాని కోతులు గద్దిస్తూ బయటకు వెళ్లడంతో బాలుడు మంజునాధ్ ప్రమాదవశాత్తు అక్కడే వున్న నీటి తొట్టిలో పడిపోయాడు నీళ్లు ఉండడంతో అందులో మునిగిపోయాడు తల్లి వచ్చి చూడగా. బాలుడు నీటి తోట్టిలో విగత జీవిగా పడివున్నాడు. దీంతో బాలుడు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Post Views: 151









