గోల్డెన్ న్యూస్/ తెలంగాణ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం కోసం దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జనవరి 9 నుంచి 12వ తేదీ మధ్య కాచిగూడ-కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ -కాచిగూడ, హైదరాబాద్-కాకినాడ టౌన్, కాకినాడటౌన్- హైదరాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లకు బుకింగ్ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి అందుబాటులోకి రానుంది.
Post Views: 45