– నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం
– జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.
గోల్డెన్ న్యూస్/ మణుగూరు: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. మణుగూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 92 సీసీ కెమెరాలు శనివారం రోహిత్ రాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఇంటికి సీసీ కెమెరాల అమర్చుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు అనేవి పోలీసులతో సమానమని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 32