హెచ్ఎంపివి వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

చైనాలో హెచ్ఎం తదు వైరస్ విజృంభిస్తుంది. దీంతో ప్రపంచ దేశా వ్యాసం అప్రమత్తం అయ్యాయి. హెచ్ఎంపీవీ కేసులపై తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఒక్క కేసు నమోదు కాలేద ని వెల్లడించింది. ప్రజలు ఎలాంటి భయాందోళ నకు గురికావొద్దని, పలు సూచనలు చేసింది. HMPV వైరస్ వ్యాప్తి నేపథ్యంలో  ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాప్తి చెందుతున్నందున శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండటానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలని, సబ్బు లేదా శానిటైజర్తో మీ చేతులను తరచుగా కడగాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు దగ్గరకి వెళ్లకూడదని పేర్కొంది.

Facebook
WhatsApp
Twitter
Telegram