గోల్డెన్ న్యూస్/ పినపాక : మండల పరిధిలో ఏడూళ్ళ బయ్యారం ఉన్నత పాఠశాలలో 2000 సంవత్సరంలో చదువుకున్న పూర్వవిద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నాడు సంబురంగా జరుపుకొన్నారు. విద్యార్థి దశలో తాము పాఠశాలలో వ్యవహరించిన తీరు, ఉపాధ్యాయులు తీసుకున్న శ్రద్ధను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించి ఆట పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి జీవన స్థితిగతులు పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు. పదవ తరగతి పూర్తి చేసి 25 సంవత్సరాలు అయినా సందర్భంగా మరో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
Post Views: 21