గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : 6 నెలల బాబు తో సహా ఓ వివాహిత అదృశ్యమైన ఘటన కరకగూడెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక సీతారాంపురం కాలనీలో నివాసం ఉంటున్న గొగ్గలి రవి అనే వ్యక్తి తన కూతురు పొలెబోయిన ప్రసన్న (24) ఆమె ఆరు నెలల బాబు ఈ నెల 5వ తేదీ ఉదయం నుంచి కనిపించడం లేదని. పరిసరాలతో పాటు బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించ లేదు. దీంతో మంగళవారం కరకగూడెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్‌ఐ ఏ రాజేందర్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 116