హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు
హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల
స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారి
హైడ్రా పోలీస్ స్టేషన్‌కి కావలసిన పోలీస్ సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు.తెలంగాణ రాజకీయాలను సాధారణ ప్రజలను కూడా ఓ కుదుపు కుదిపేసిన ‘హైడ్రా’ వ్యవహారం అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. భాగ్య నగరాన్ని సుందర నందనవనంగా మార్చడమే లక్ష్యంగా మూసీ నది ఆక్రమణలు తొలగించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు నడుం బిగించింది. ఈ క్రమంలోనే గత ఏడాది జూన్‌లో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనంతరం.. నెల రోజుల తర్వాత పని ప్రారంభించింది. అనేక మంది ప్రముఖుల ఇళ్లతోపాటు. పేదల నివాసాలపైనా దాడులు జరిగాయి.ఈ క్రమంలోనే అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గక పోగా హైడ్రాకు మరిన్ని అధికారాలను