గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే.

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వెంకటాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయితీ కార్యాలయాన్ని పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని అధికారులతో సూచించారు.  అనంతరం (CMRF) చెక్కులు పంపిణీ చేశారు. వెంకటాపురం గ్రామంలోని మా ఊరమ్మ తల్లి  అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీ ఓ కుమార్, పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ఇక్బాల్ హుస్సేన్, నియోజకవర్గ మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలెబోయిన తిరుపతయ్య, ఎర్ర సురేష్, తోలెం నాగేశ్వరరావు జలగం క్రిష్ణ, గోగ్గల రవి,లక్క శ్రీను,కరకపల్లి నాగేశ్వరరావు, భూక్యా రాందాసు,నాగేష్,శివరాత్రి సతీష్,సూర సంతోష్, పోలెబోయిన విష్ణుమూర్తి,మైపాతి శంకరయ్య,బడుగుల మధు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram