గోల్డెన్ న్యూస్/ కరకగూడెం :క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని కరకగూడెం,ఎంపీడీవో దేవ వర కుమార్, ఎస్సై రాజేందర్, ఎంఈఓ గడ్డం మంజుల అన్నారు. బుధవారం కరకగూడెం మండలంలోని హజరత్ ఆలీబాబా వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్లును ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో వాలీబాల్,క్రికెట్ టోర్నమెంట్లు విరివిగా నిర్వహించి,క్రీడాకారుల నైపుణ్యం ఎంతో అవసరం ఉందని వారు.అభిప్రాయపడ్డారు.క్రీడల్లోచూపించే ప్రతిభను అందరికీ స్ఫూర్తివంతమన్నారు.క్రీడల వల్ల విద్యార్థులు,యువతి, యువకుల్లో ఐక్యమత్యాన్ని పెంపొందించవచ్చన్నారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాలీబాల్ టోర్నమెంట్ లు యువకుల్లో ఐక్యతను పెంచుతాయన్నారు.హజరత్ ఆలీబాబా వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్లును కరకగూడెం మండల మాజీ ఎంపీపీ రేగా కాలిక,బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,కాంగ్రెస్ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,సెక్రెటరీ విజయ్,స్కూల్ టీచర్ రాధ తదితరులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హజరత్ ఆలీబాబా కమిటీ సభ్యులు ఫారుక్,రంజిత్,భార్గవ్,మోయిన్,మోబి,అతిక్,మండల రిపోర్టర్లు బట్టా బిక్షపతి,దుర్గం ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 43