గోల్డెన్ న్యూస్/కరకగూడెం : మండలం లోని చిరుమళ్ళ గ్రామానికి చెందిన చందా ప్రసాద్ కు కరకగూడెం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నాడు ఈ క్రమంలోనే ఈనెల 7 తేదీన తన ఖాతాలోని డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లాడు. సాంకేతిక కారణాలవల్ల డబ్బులు విత్డ్రా చేయలేకపోయాడు. గ్రామంలోని ఓ బయోమెట్రిక్ మినీ ఏటీఎం కేంద్రానికి వెళ్లి 6 వేల రూపాయలు విత్డ్రా చేయాల్సిందిగా నిర్వాహకుడికి కోరాడు. నిర్వాహకుడు బయోమెట్రిక్ లో వేలు పెట్టాల్సిందిగా తెలుపగా. వినియోగదారుడు వేలిముద్ర పెట్టాడు. కానీ లిమిట్ అయిపోయింది డబ్బులు రావడం లేదని డబ్బులు ఇచ్చే వ్యక్తి తెలిపాడు. చేసేదేమీ లేక ప్రసాద్ ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు 8వ తేదీన బ్యాంకు లోని తన ఆర్థిక లావాదేవీలను సరిచూసుకున్న ప్రసాద్ కు తన ప్రమేయం లేకుండానే డబ్బులను ఎవరో కాజేసినట్లు గుర్తించాడు. విషయం బ్యాంకు మేనేజర్ కు చెప్పి తన ఖాతా స్టేట్మెంట్ తీసుకున్నాడు. అయితే డబ్బులు 7 తేదీన బయోమెట్రిక్ విధానంలో మినీ ఏటీఎం దగ్గర డెబిట్ అయినట్లు గా గుర్తించి బ్యాంక్ అధికారులు ఆయనకు తెలిపారు. బయోమెట్రిక్ ఏటీఎం ద్వారా వినియోగదారుడు 6 వేల రూపాయలు మోసపోయానని వాపోయాడు. బయోమెట్రిక్ నిర్వహించే వ్యక్తి అందుబాటులో లేడు. ఆయన వచ్చాక ఈ విషయపై నిలదీస్తామన్నాడు. మండలంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని ఎవ్వరికి ఫిర్యాదు చేయాలో అర్ధం కాక చాలా మంది మోసపోతున్నారని.ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు దృష్టి సారించి గ్రామాాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
