స్టడీ అవర్‌కు ఆలస్యంగా వచ్చారని 30 మంది విద్యార్థులను వాతలు వచ్చేలా కొట్టిన పీడీ
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలోని గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులకు ఉదయం వేళ నిర్వహించిన ప్రత్యేక స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా వచ్చిన 30 మంది విద్యార్థులను కర్రతో చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్ వాసు
ఒళ్లంతా వాతలు రావడంతో తరగతిలో కూర్చోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డ విద్యార్థులు.. తీవ్రంగా గాయపడిన కొందరిని సిద్దిపేటలోని ఒక ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం
తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి హర్షవర్ధన్ హైదరాబాద్లోని రామంతాపూర్లో నివాసం ఉంటున్న తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో.. వారు పాఠశాలకు చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు
ఫిజికల్ డైరెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగి. విద్యార్థులను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్‌ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.