నవోదయ పాఠశాల ఏర్పాటుకు పరిశీలన

గోల్డెన్ న్యూస్/కరకగూడెం :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చెసిన నవోదయ పాఠశాలను వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల  కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని పాత కేజీబీవీ పాఠశాలను  జిల్లా విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వరాచారి, ఏ ఎం ఓ నాగరాజశేఖర్ గురువారం పరిశీలించారు. నవొదయ పాఠశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తే అందుకు అవసరమైన  సదుపాయాల కల్పన కోసం తీసుకొ వాల్సిన చర్యలను వారు పరిశీలించి అంచనా వేశారు. అనంతరం జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల ఎంఈఓ మంజులను పాఠశాల భవనాలు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గదులను పరిశీలించారు. గతంలో ఈ భవనాల్లో కేజిబివి పాఠశాల కొనసాగేదని, హెచ్ఎం మంజుల తెలిపారు. ఎంఆర్సి భవనాన్ని, పాత కేజిబివి భవనాలను పరిశీలించి ఉన్నత పాఠశాల తరగతులను మరమ్మత్తులు చేయించి ఈ భవనాల్లో కొనసాగిస్తే నూతన నవోదయ పాఠశాల ప్రారంభానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు డిఇఓ తెలిపారు. పాత కేజిబివి, ఎంఆర్సి భవనాలు మరమ్మత్తులు అవసరం కాగా.. వచ్చే విద్యాసంవత్సరం జూన్ నాటికి నవోదయ పాఠశాలను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాల జారీ అయ్యాయన్నారు. అవసరమైన ఇంజనీరింగ్ అధికారుల ప్రతిపాదనల మేరకు నివెదికలను జిల్లా కలెక్టర్ కు సమర్పించనున్నట్లు డిఇఓ తెలిపారు. హైస్కూల్ ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల తరగతి గదులు, ఉన్నత పాఠశాల తరగతి గదులు, కిచెన్ షెడ్, టాయిలెట్స్ తదితర అంశాలు సవోదయ పాఠశాల ఏర్పాటుకు అవసరమని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram