ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
గోల్డెన్ న్యూస్/ మణుగూరు : విద్యార్థులకు ‘అపార్’( ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ర్టీ) నెంబర్ తప్పనిస క్రియేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏం వెంకటేశ్వర చారి ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం ఉదయం పినపాక, కరకగూడెం మండలాల ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అపార్ ఆవశ్యకతను తెలియజేసి దానిని పిల్లలందరికీ తప్పనిసరిగా జనరేట్ చేయాలని ఆదేశించారు. అపార్ ఐడి జనరేట్ చేయటంలో వచ్చే సాంకేతిక సమస్యలు వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్ వివరించారు. ఈ సమావేశంలో పినపాక మండల విద్యాశాఖ అధికారి శ్రీ కె నాగయ్య రెండు మండలాల నుంచి అన్ని పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ నాగరాజు శేఖర్ మాట్లాడుతూ పిల్లల యొక్క ఎఫ్ఎల్ఎన్ కు సంబంధించి బేస్ లైన్ మరియు మిడ్లైన్ అసెస్మెంట్ ల యొక్క వివరాలను యాప్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ అందజేసిన నోట్ పుస్తకాలను సమర్ధవంతంగా వినియోగించి పిల్లలలో అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించాలని తెలిపారు.
మధ్యాహ్నం మణుగూరులో జరిగిన మణుగూరు మండల ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ మండలంలోని ప్రైవేటు పాఠశాలలన్నీ అతి తక్కువగా అపార్ ఐడి జనరేట్ చేశారని వారు తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి అపార్ ఐడిని జనరేట్ చేయాలని తెలియజేశారు. సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయులు అడిగిన పలు సందేహాలకు జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్ సతీష్ కుమార్ వివరణ ఇచ్చారు. అదేవిధంగా అన్ని పాఠశాలల్లో ఎఫ్ ఎల్ ఎన్ సమర్థవంతంగా అమలు చేయాలని పిల్లలకు సంబంధించిన అసెస్మెంట్ లను పూర్తి చేసి యాప్ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ నాగరాజు శేఖర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జి నాగశ్రీ, కే శ్రీలత, మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.