9 మంది మవోయిస్టుల లొంగుబాటు

చత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతకు కోసం సాయధ బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడ పడుతుండగా, ఇంకోవైపు మావోయిస్టుల లొంగుబాటు పథకాలను కూడా ప్రోత్సహిస్తున్నారు.

సుక్మా జిల్లా లో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా 9 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చవాన్ఎదుట లొంగిపోయారు.

ఇద్దరు మావోయిస్టులకు ఒక్కొక్కరికి రూ.8 లక్షలు, నలుగురికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల రివార్డు ఉండగా.. లొంగిపోయిన మావోయిస్టుల మొత్తం రివార్డు రూ.43 లక్షలను వారికి అందించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు వారితో కలిసి భోజనం చేసి.. వారికి నూతన దుస్తులతో పాటు మిఠాయిలు , రివార్డు చెక్కులను అందించారు.  వారికి పునరావస పథకం కింద అందించాల్సిన అన్ని సహాయ సహకారం అందించనున్నట్లు ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram