రేషన్ కార్డు లేని వారుకి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అర్హులందరికీ ఈ నెల 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు , రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదే విధంగా సాగు భూమికి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తామన్నారు. భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందజేస్తామన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తామని నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తా మన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల నుండి ఉన్నట్లు మంచికి తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram