గిరిజనులకు తప్పని డోలి కష్టాలు

గిరిజన మహిళకు తప్పని ప్రసవ వేదన.

గోల్డెన్ న్యూస్/ విజయనగరం : శృంగవరపు కోట ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. కొండ శిఖర గ్రామాల్లో గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. ‘అమ్మ’తనానికి ఎంతో వేదన తప్పడం లేదు. అలాంటి సంఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విజయనగరం  జిల్లా శృంగవరపుకోట మండలంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శృంగవరపుకోట పంచాయతీ రేగపుణ్యగిరి గ్రామానికి చెందిన సీదరి శాంతికి గురువారం రాత్రి 11 సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. ఎస్‌.కోట పట్టణ కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరం కొండలపై ఉన్న ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. శాంతి భర్త శివ తోటి గిరిజనుల సాయంతో డోలి కట్టి, రాత్రి ఒంటిగంట సమయానికి పుణ్యగిరి దేవస్థానం టికెట్‌ కౌంటర్‌ వద్దకు ఆమెను తీసుకొచ్చారు. శాంతికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో మరో గిరిజన మహిళ డెలివరీ చేయించింది. 2.30 గంటల సమయంలో 108 వాహనం రావడంతో అందులో శృంగవరపుకోట ఏరియా ఆస్పత్రికి తల్లి, బిడ్డను తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram