చత్తీస్ ఘడ్ లో ఎన్కౌంటర్ 17 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని బీజాపుర్ జిల్లాలో గురువారం మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్ ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. మరోవైపు శుక్రవారం కూడా ఇక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు దక్షిణ బస్తర్ అడవుల్లో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే  వర్గాల సమాచారంతో బీజాపుర్, సుక్మా, దంతెవాడ జిల్లాల నుంచి  డిస్ట్రిక్ట్రి రిజర్వ్ గార్డ్, కోబ్రా 204, 205, 206, 208, 210, సీఆర్పీఎఫ్ 229 బెటాలియన్లకు చెందిన సుమారు 1,500 మంది  జవాన్లు గురువారం దండకారణ్యంలో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు  ఎదురుకాల్పులు కొనసాగగా 17 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి ఒక ఎస్ఎల్ఆర్  ఆయుధ సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించ లేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. పూర్తి వివరాలను ఆపరేషన్ తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram