తెలంగాణ: కొత్త రేషన్ కార్డుల జారీకి వేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో పాత రేషన్ కార్డులను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పాత రేషన్ కార్డులను తొలగించబోమని స్పష్టం చేశారు. అంత ప్రభుత్వం పదేళ్లుగా కొత్త కార్డులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరు ఆందోళన పడవద్దని, పాత కార్డులను డిస్టర్బ్ చేయమని, మంత్రి ప్రభాకర్ అన్నారు. పేర్లు మార్పిడికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఆయన సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ నాఫెడ్, టీసీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయని కారణంగా నెలకొన్న సమస్యలను అధిగమిస్తూ కుటుంబాల వారిగా మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. జనవరి 26 నుంచి వ్యవసాయ యోగ్య మైన భూములకు రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు, అదే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని కూలీలకు రూ.12వేలు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే కొనసాగుతోందని, సర్వే ఆధారంగా పారదర్శకంగా పేదలకు ఇండ్లను కేటా యిస్తామని తెలిపారు.
<
<









