షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన ఫంక్షన్ హాల్ పరిశీలించిన ఎమ్మెల్యే

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్లోని  జివిఆర్ ఫంక్షన్ హాల్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి  మంటలు వ్యాపించి ఫంక్షన్ హాల్ మొత్తం దగ్ధమైనది ఈ విషయం తెలుసుకున్న పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం  దగ్ధమైన ఫంక్షన్ హాల్ ని పరిశీలించి షార్ట్ సర్క్యూట్ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం  కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram