బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు నమోదు 

గ్యార ఉపేందర్ ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు చేసిన పోచారం పోలీసుల

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదైంది. ఏకశిలనగరంలో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా తనపై దాడి చేశారని గ్యార ఉపేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోచారం పోలీసులు ఈటల రాజేందర్‌పై కేసు నమోదు చేశారు. ఈటలతోపాటు దాడికి పాల్పడిన మరో 30 మందిపైనా కేసు నమోదైంది. ఈటలతోపాటు ఏనుగు సుదర్శన్ రెడ్డి, శివారెడ్డి, బస్వరాజ్, బుబైర్ అక్రమ్ లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram