ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం :  ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాల అమలులో భాగంగా నిర్వహిస్తున్న లక్ష్మీదేవి పల్లి మండలలోని అనిశెట్టి పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. గ్రామ సభలో మండల ప్రత్యేక అధికారి, గ్రామపంచాయతీ సెక్రటరీ నాలుగు సంక్షేమ పథకాల అర్హుల జాబితాను సభకు చదివి వినిపించారు. అర్హుల జాబితాలో వచ్చిన వచ్చిన అభ్యంతరాలను విన్నారు. ఈ సందర్భంగా కలెక్ట్ మాట్లాడుతూ.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లు  పథకాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధికి దోహదపడతాయి అన్నారు.

ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఈ గ్రామ సభలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అర్హులకు జాబితాలో పేరు రానివారు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని గ్రామ సభలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించాలని అన్నారు. గ్రామ సభల నిర్వహణ అర్హులను, అనర్హులను గుర్తించడానికి, అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి అని ఆయన తెలిపారు. దరఖాస్తుదారులు గ్రామ సభలలో కానీ ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాల్లో సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పీవీ చలపతిరావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,గ్రామ పంచాయతీ సెక్రటరీ, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram