గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేత.

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు గురువారం జిల్లా లోని  గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయాలని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విజ్ఞప్తి మేరకు . కరకగూడెం మండల కేంద్రంలోని గాంధీజీ విగ్రహానికి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రావుల సోమయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గురువారంతో 420 రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు..

Facebook
WhatsApp
Twitter
Telegram