భద్రాచలంలో టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం.
గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం : అక్రమంగా కారులో తరలిస్తున్న గంజాయిని భద్రాచలం గోదావరి బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద నార్కోటిక్స్ అధికారులు పట్టుకున్నారు.
భద్రాచలం పరిసర ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తూ, అనేకమంది అనేక సందర్భాల్లో పోలీసులకు పట్టుబడిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాంటి విషయాలను గుర్తించి పత్రికలలో ప్రచురించి ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత పాత్రికేయులది. అలాంటి బాధ్యత నిర్వహించాల్సిన పాత్రికేయులే గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఘటన ఒకటి తీవ్ర సంచలనం సృష్టించింది. హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ అధికారులు భద్రాచలం బ్రిడ్జి చెక్ పోస్ట్ వాహనాలు తనీఖీలు నిర్వహిస్తుండగా ( AP37 BU 5216) నెంబర్ గల కారును తనిఖీ చేయగా కారులో 81.950 కేజీల ఎండు గంజాయి వారికి లభ్యమైంది. గంజాయి తరలిస్తున్న కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపు లోకి తీసుకుని విచారించగా , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సోంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పండగ రాములు (సూర్య పత్రిక విలేకరి) పట్టుబడ్డాడు. అతని తమ్ముడు మరో విలేకరి పండగ వెంకటేశ్వర్లు (తెలంగాణ కేసరి పత్రిక), ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, కుంట తాలూకా మర్లగూడ గ్రామానికి చెందిన మడవి నంద అనే వ్యక్తి పట్టుబడ్డారు. కారుతో సహా నిందితులను భద్రాచలం టౌన్ పోలీసులకు అప్పగించి వివరాలు ప్రకటించారు. ఈ సంఘటనలో పట్టుబడిన 81.950 తేదీన గంజాయి విలువ రూ.20.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.