అఘోరి కారు చూశారా.. రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది ?

  వాహనానికి రిజిస్ట్రేషన్‌ నంబర్‌  లేదు.అయినా డోంట్ కేర్.

నెంబర్ ప్లేట్లు లేకుండా, నంబర్ ప్లేట్స్ వంచినా, అడ్డుగా స్టిక్కర్స్ వేసి వాహనదారులు తమ వాహనాలు నడిపితే సీజ్‌ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్న అధికారులు ఆమె విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు.

గోల్డెన్ న్యూస్ /  వరంగల్ :  వరంగల్ జిల్లాలో మహిళా అఘోరీ హల్చల్ గురువారం హల్చల్ చేసింది.  గీసుగొండ మండలం కొమ్మాల దగ్గర అఘోరీ ప్రత్యక్షమైంది  గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుంభమేళాకు వెళ్లకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావని  ప్రశ్నించినందుకు ఆ వ్యక్తిపై  దాడికి చేసేందుకు ప్రయత్నించింది  స్థానికులు అడ్డుకోవడంతో. అక్కడ నుండి నర్సంపేట మీదుగా ఖానాపురం మండలం మంగలారిపేట దుర్గమ్మ గుడి దగ్గరకు చేరుకుంది. అఘోరీ కారుకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు .కారు నెంబర్ ప్లేట్ పై  అఘోరీ నాగసాధు అని రాసి ఉండటం కొసమెరుపు. నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణం చేస్తున్న అఘోరీ వాహనంపై పోలీసులు చర్యలు తీసుకోక పోవడంపై  ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు ద్విచక్ర వాహనానికి నంబరు ప్లేట్లు లేకుండా, నంబర్ ప్లేట్స్ వంచినా, అడ్డుగా స్టిక్కర్స్ వేసి వాహనదారులు తమ వాహనాలు నడిపితే అట్టి వారిని గుర్తించి  వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలించి సీజ్‌ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెబుతున్న అధికారులు ఈ విషయంపై ఎందుకు మౌనం వహిస్తున్నార ని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram