ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : హేమచంద్రాపురం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో 15 రోజుల పాటు సాగిన జిల్లా అర్మడ్ రిజర్వ్ సిబ్బంది మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో జిల్లాఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ముందుగా జిల్లా అర్మడ్ సిబ్బంది నుండి ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించారు.05 ప్లటూన్లతో ఏర్పాటు చేసిన ఈ పరేడ్ కు అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు ప్లటూన్ కమాండెర్ గా వ్యవహరించారు.పదిహేను రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇండోర్,ఔట్ డోర్,ఫైరింగ్ ప్రాక్టీస్ లో సిబ్బంది అంతా ఉత్సాహంగా పాల్గొన్నారని ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ ఎస్పీ కి వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మట్లాడుతూ పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ తో పాటు భాద్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు ఉత్తమమైన సేవలందించాలని సూచించారు.ఈ మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా శారీరక దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందన్నారు. పరేడ్ ను చూస్తే తమ శిక్షణ రోజులు గుర్తొస్తున్నాయని అన్నారు.అనంతరం అక్కడ పాల్గొన్న అధికారులు,సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతామని తెలియజేశారు.నిరంతరం విధులలో ఉండే పోలీసు అధికారులు,సిబ్బందికి వ్యక్తిగత,కుటుంబపరమైన,శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లపుడూ ముందుంటామని వివరించారు.ఈ డీ-మొబిలైజేషన్ పరేడ్ కార్యక్రమాన్ని సుందరంగా ఏర్పాటుచేసిన అధికారులను అభినందించారు.