గోల్డెన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రోత్సాహంతో, సంప్రదాయ గద (మోసే దండు) వ్యాయామాన్ని ప్రాచుర్యం చేస్తూ, యువత శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గద వ్యాయామం ద్వారా శరీర ధృడత, సమతౌల్యం, మరియు శక్తి పెరుగుతుంది. వెదురు (బ్యాంబు) లేదా స్థానికంగా లభించే జామయిల్ కర్ర, మట్టి కుండలతో తక్కువ ఖర్చుతో గదలను తయారు చేయవచ్చ ఈ గద తయారీ ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, యువతకు మార్గదర్శ కాలు సూచించారు.ఈ విధంగా సంప్రదాయ వ్యాయామ పద్ధతులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, ఉపాధికి మార్గాన్ని చూపిస్తున్నాయని అన్నారు
Post Views: 38