గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం కాల్పలు కలకలం రేపాయి. ఒక పబ్ కు వెళ్లిన పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా సమాచారంతో పబ్ కు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నేరస్తుడు తన వద్దనున్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు.
మొత్తం రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పబ్లో పనిచేసే బౌన్సర్కు, కానిస్టేబుల్ వెంకటరామిరెడ్డి కి గాయాలయ్యాయి. చివరకు పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ. కాకానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించారు.
Post Views: 40