కస్తూర్బా హాస్టల్ విద్యార్థిని అదృశ్యం

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపాడు కస్తూర్బా హాస్టల్‌ విద్యార్థిని అదృశ్యమయింది. బూర్గంపాడులోని జూనియర్‌ కాలేజీలో నర్సింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని.. శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు బంధువుల పేరుతో బయటికి తీసుకెళ్లారు. రాత్రి పొద్దుపోయినా ఆమె తిరిగి రాకపోవడంతో సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బూర్గంపాడు కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 17 సంవత్సరాల బాలికను ఆమె వదిన సుమలత అను మహిళ బాలికకు కావలసిన సామాన్లు కొనించేందుకు బయటకు తీసుకొని వెళ్లేందుకు రెండు గంటలు అనుమతి కావాలని లెటర్ రాసి సంతకం పెట్టి తీసుకువెళ్లింది. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో హాస్టల్ అధికారులు ఆమె ఫోన్ కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బూర్గంపాడు కస్తూరిబా బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ మాలోజ్ సుమలత బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణలో బాలిక వదిన సిసింద్రీ అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై బాలికలు పంపించినట్లు తెలిసిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బూర్గంపాడు ఎస్సై ఈ రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram