గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : తెలంగాణలో ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న వేళ.. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ లోపే పంచాయతీ ఎన్నికల తేదీలు రానున్నాయనే సంకేతాలు ఇచ్చారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి.. ఎన్నికలు వస్తున్నాయ్, జాగ్రత్త అంటూ హస్తం పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీలు, అభ్యర్థులు సన్నద్ధం అవుతూనే ఉన్నారు.
Post Views: 50